ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా సమక్షంలో కేశినేని శ్వేత జన్మదిన వేడుకలు
- నేడు కేశినేని నాని కుమార్తె శ్వేత పుట్టినరోజు
- ఇటీవలే రఘుతో శ్వేత వివాహం
- శ్వేత, రఘు దంపతులను తన నివాసానికి ఆహ్వానించిన రతన్ టాటా
- రతన్ టాటా ఇంట్లో కేక్ కట్ చేసిన శ్వేత
టీడీపీ ఎంపీ కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అయితే, ఆమె భారత వ్యాపార దిగ్గజం రతన్ టాటా సమక్షంలో జన్మదిన వేడుకలు జరుపుకోవడం విశేషం. అది కూడా రతన్ టాటా ఇంట ఈ వేడుక జరిగింది.
కేశినేని నానికి, రతన్ టాటాకు మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. విజయవాడ పార్లమెంటు స్థానంలో టాటాల సహకారంతో నాని అనేక కార్యక్రమాలు నిర్వహించారు. దాంతో, కేశినేని నాని కుటుంబానికి, రతన్ టాటాకు మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. దాంతో, తన ఇంట పుట్టినరోజు జరుపుకోవాల్సిందిగా రతన్ టాటా... కేశినేని శ్వేత, రఘు దంపతులను ఆహ్వానించారు.
ఇటీవల శ్వేత వివాహం జరగ్గా... ఆమె భర్త రఘుతో కలిసి ముంబయిలోని రతన్ టాటా నివాసానికి వెళ్లారు. అక్కడే కేక్ కట్ చేసి రతన్ టాటాకు తినిపించారు. రతన్ టాటా... ఈ సందర్భంగా కేశినేని శ్వేతకు శుభాకాంక్షలు తెలిపి ఆశీస్సులు అందించారు.
అమెరికాలోని ఎమోరీ యూనివర్సిటీలో ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసిన కేశినేని శ్వేత తండ్రి కేశినేని నాని రాజకీయ వారసురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2014లో ఆమె అమెరికాలోని అట్లాంటా సెనేటర్ ఎన్నికల్లో ప్రచార బాధ్యతలు నిర్వర్తించారు. ముఖ్యంగా, 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ల అభ్యర్థి హిల్లరీ క్లింటన్ తరఫున ప్రచారం నిర్వహించడం విశేషం. రెండేళ్ల కిందట జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయవాడ టీడీపీ మేయర్ అభ్యర్థిగానూ బరిలో నిలిచారు.