ఏ పేదవాడి ఇంటిముందైనా నిలబడి మా ప్రభుత్వం చేసిన మంచి ఇదీ అని చెప్పగలరా?: చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్

  • సెల్ఫీ అంటే నాలుగు ఫేక్ ఫొటోలు దిగడం కాదన్న ముఖ్యమంత్రి
  • నువ్వు మంచి చేశావయ్యా అని ఆశీర్వదించే పేదవారితో దిగినదే గొప్ప సెల్ఫీ అని వెల్లడి
  • ఎవరి హయాంలో ప్రజలకు జరిగిన మంచి ఎంతనేది బేరీజు వేసుకునే సత్తా ఉందా? అని ఛాలెంజ్ 
సెల్ఫీ చాలెంజ్ అంటే నాలుగు ఫేక్ ఫొటోలు కాదని, పేదవాడి ఇంటి ముందు నిలబడి మా ప్రభుత్వం వల్ల జరిగిన మంచి ఇదీ అని చెప్పగలగాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. దానికి ఆ కుటుంబం కూడా చిరునవ్వుతో ఆశీర్వదిస్తే దానిని సెల్ఫీ అంటారు.. దానినే గొప్ప సెల్ఫీ అంటారని వివరించారు. ఈ విధంగా మీ ప్రభుత్వ హయాంలో చేసిన పనిని పేదవాడి ఇంటిముందు నిలబడి చెప్పగలరా అని చంద్రబాబుకు సవాల్ విసిరారు. మార్కాపురంలో జరిగిన ఈబీసీ నేస్తం నిధుల విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు.

రాష్ట్రంలో ఏ పేద కుటుంబాన్ని తీసుకున్నా, ఏ గ్రామాన్ని తీసుకున్నా గత ప్రభుత్వ హయాంలో ఇంటింటికీ జరిగిన మంచి ఎంత అని, మనందరి ప్రభుత్వ హయాంలో ఈ నాలుగేళ్లలో జరిగిన మంచి ఎంత అని అడిగి తెలుసుకోవాలని జగన్ చెప్పారు. మీ ప్రభుత్వ హయాంలో జరిగిన మంచిని, ఈ నాలుగేళ్ల మా పాలనలో జరిగిన మంచిని బేరీజు వేసుకుని చూసే సత్తా నీకు ఉందా బాబూ? అని అడుగుతున్నానని, చాలెంజ్ అంటే ఇదే అని జగన్ తెలిపారు. ఎవరి హయాంలో ఏం జరిగిందని, మేలు చేసే ప్రభుత్వం ఏదనేది ప్రజలకు తెలుసని జగన్ పేర్కొన్నారు.


More Telugu News