'రుద్రుడు' సినిమాకి నేను డైరెక్షన్ చేయకపోవడానికి కారణమిదే: లారెన్స్

  • 'లారెన్స్ హీరోగా రూపొందిన 'రుద్రుడు'
  • దర్శకుడిగా కథిరేసన్ పరిచయం
  • కథానాయికగా ప్రియా భవానీశంకర్
  • ఈ నెల 14వ తేదీన సినిమా విడుదల
హారర్ కామెడీ జోనర్ పై లారెన్స్ ముద్ర ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ జోనర్లో ఆయన చేస్తూ వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలను నమోదు చేశాయి. అయితే ఈ మధ్య కాలంలో లారెన్స్ చాలానే గ్యాప్ తీసుకున్నారు. తన తాజా చిత్రమైన 'రుద్రుడు'తో, ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు.  

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజా ఇంటర్వ్యూలో లారెన్స్ మాట్లాడుతూ .. "కావాలని చెప్పి నేను గ్యాప్ తీసుకోలేదు. రెండేళ్ల పాటు కరోనాతో సరిపోయింది. ఆ తరువాత హిందీలో 'లక్ష్మి' సినిమాకి డైరెక్షన్ చేశాను. అందువలన ఇక్కడి సినిమాలకి గ్యాప్ వచ్చింది. ఇకపై గ్యాప్ రాకుండా చూసుకుంటాను .. ఏడాదికి రెండు సినిమాలైనా చేస్తాను" అని అన్నారు. 

'రుద్రుడు' సినిమాకి నేను ఎందుకు డైరెక్షన్ చేయలేదని అంతా అడుగుతున్నారు. నిజానికి కథిరేసన్ నిర్మాత. 'రుద్రుడు' కథ ఆయనదే .. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కావాలనేది ఆయన కోరిక. ఈ కథ నాకు బాగా నచ్చడం వలన ఓకే చెప్పేశాను. లారెన్స్ సినిమా నుంచి ఆడియన్స్ ఆశించే అన్ని అంశాలు ఇందులో ఉంటాయి" అని చెప్పుకొచ్చారు.     


More Telugu News