కంటెంట్ చూస్తుంటే .. 'విడుదల' హిట్ కొట్టేలానే ఉందే!
- కంటెంట్ కి పెరుగుతున్న ప్రాధాన్యత
- స్టార్స్ ఎవరన్నది పట్టించుకోని ఆడియన్స్
- చిన్న సినిమాలు సాధిస్తున్న పెద్ద విజయాలు
- ఈ నెల 15న తెలుగులో వస్తున్న 'విడుదల'
ఈ మధ్య కాలంలో కంటెంట్ ఉంటే చాలు .. కాసుల వర్షం కురిసేస్తోంది. సినిమా బడ్జెట్ .. స్టార్స్ .. ఇవేమీ ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు. కంటెంట్ కనెక్ట్ అయితే చాలు .. థియేటర్ల దగ్గర వసూళ్లు మామూలుగా ఉండటం లేదు. సౌత్ లోని అన్ని భాషల్లోనూ ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తుండటం విశేషం.
కన్నడలో ఆ మధ్య వచ్చిన 'కాంతార' సినిమా బడ్జెట్ కీ .. వసూళ్లకు అసలు పొంతనే లేదు. ఆ సినిమాకి ముందు రిషబ్ శెట్టి పెద్ద స్టార్ కాదు .. సప్తమి గౌడ స్టార్ హీరోయిన్ కూడా కాదు. ఇక మలయాళంలో వచ్చిన 'రోమాంఛమ్' కూడా అతి తక్కువ బడ్జెట్ లో నిర్మిస్తే, ఇప్పుడు ఆ సినిమా 60 కోట్లకి పైగా వసూలు చేసింది. ఇక 'బలగం' సినిమా విషయంలోను అంతే జరిగింది.
ఈ నేపథ్యంలో తమిళంలో రూపొందిన 'విడుదలై' కూడా మార్చి 31న థియేటర్లకు వచ్చింది. వసూళ్ల పరంగా అక్కడ ఈ సినిమా దూసుకుపోతోంది. విజయ్ సేతుపతి - సూరి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, 'విడుదల' టైటిల్ తో ఈ నెల 15న తెలుగులో రిలీజ్ అవుతోంది. కంటెంట్ పరంగా ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ సినిమా, ఇక్కడ కూడా హిట్ టాక్ తెచ్చుకోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.