ఒక్క రోజే 7,840 కరోనా కేసుల నమోదు
- దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు
- 40 వేలు దాటిన యాక్టివ్ కేసుల సంఖ్య
- ఢిల్లీలో వెయ్యికి చేరువైన డైలీ కేసులు
కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా రోజురోజుకూ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా మంగళవారం ఒక్క రోజే దేశవ్యాప్తంగా 7,830 మందికి వైరస్ సోకిందని అధికారులు తెలిపారు. ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఏడు నెలల తర్వాత మళ్లీ ఇప్పుడేనని వివరించారు. దీంతో దేశంలో ప్రస్తుతం ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య 40,215 కు చేరిందని వివరించారు. ఒక్క ఢిల్లీలోనే 980 కరోనా కేసులు బయటపడ్డాయని తెలిపారు.
రోజువారీ పాజిటివిటీ 3.65 శాతానికి, వీక్లీ పాజిటివిటీ రేట్ 3.83 శాతానికి చేరిందని అధికారులు పేర్కొన్నారు. వైరస్ నుంచి కోలుకుంటున్న వారి శాతం (రికవరీ రేటు) 98.72 శాతానికి చేరుకుందని అన్నారు. వైరస్ తో మంగళవారం 11 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో దేశంలో కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 5,31,016 కు చేరిందని తెలిపింది.