ఐదుగురిని కాల్చి చంపిన దుండగుడిని తుదముట్టించిన పోలీసులు.. వీడియో ఇదిగో
- యూట్యూబ్ లో పెట్టిన అమెరికా పోలీసులు
- సిబ్బంది బాడీ కెమెరా నుంచి ఫుటేజీ సేకరణ
- కెంటకీలో తోటి ఉద్యోగులపై కాల్పులు జరిపిన బ్యాంకు ఉద్యోగి
ఐదుగురు సహోద్యోగులను కాల్చి చంపిన ఓ బ్యాంకు ఉద్యోగిని పోలీసులు మట్టుబెట్టారు.. అమెరికాలోని కెంటకీ రాష్ట్రంలో సోమవారం చోటుచేసుకుందీ ఘటన. ఈ ఆపరేషన్ లో పాల్గొన్న పోలీసుల బాడీ కెమెరా ఫుటేజీలను అధికారులు విడుదల చేశారు. యూట్యూబ్ లో పెట్టిన ఆ వీడియోలలో పోలీసులు బ్యాంకు బిల్డింగ్ దగ్గరికి చేరుకున్నప్పటి నుంచి హంతకుడిని తుదముట్టించేదాకా స్పష్టంగా కనిపిస్తోంది. వీడియో ఇదిగో..
అసలేం జరిగిందంటే..
కెంటకీలోని ఓ బ్యాంకులో పనిచేస్తున్న కానన్ స్టర్జన్ సోమవారం తన గన్ తో ఆఫీసుకు వచ్చాడు. తోటి ఉద్యోగులపై కాల్పులు జరిపి బ్యాంకులో బీభత్సం సృష్టించాడు. కాల్పుల విషయం తెలిసి ఇద్దరు పోలీసులు బ్యాంకుకు చేరుకున్నారు. స్టర్జన్ ను అదుపులోకి తీసుకునే ప్రయత్నం విఫలం కావడంతో కాల్పులు జరిపి తుదముట్టించారు. స్టర్జన్ జరిపిన కాల్పుల్లో ఐదుగురు చనిపోగా ఓ పోలీస్ ఆఫీసర్ సహా మరో ఎనిమిది మంది గాయపడ్డారు. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
వీడియో ఫుటేజీ..
ఈ ఆపరేషన్ కు సంబంధించిన వీడియోను లూయిస్ విల్లే పోలీసులు యూట్యూబ్ లో పోస్ట్ చేశారు. పోలీసుల బాడీ కెమెరాల నుంచి ఈ ఫుటేజీని తీసుకున్నారు. బ్యాంకు సిబ్బంది సమాచారంతో ఇద్దరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తుపాకులు చేతబట్టి బ్యాంకు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసుల రాకను గమనించిన స్టర్జన్.. వారిపైకి కూడా కాల్పులు జరిపాడు. దీంతో ఓ పోలీస్ ఆఫీసర్ కు బుల్లెట్ గాయాలయ్యాయి. బ్యాకప్ కోరుతూ ఘటనా స్థలం నుంచి రిక్వెస్ట్ రావడంతో మరికొంతమంది పోలీసులు బ్యాంకు దగ్గరికి చేరుకున్నారు. పోలీసుల కాల్పుల్లో స్టర్జన్ చనిపోయాక బ్యాంకు లోపలికి ప్రవేశించి, గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఆపరేషన్ మొత్తాన్నీ వీడియోలో స్పష్టంగా చూడొచ్చు.