రైతుల కొడుకుల్ని పెళ్లి చేసుకునే అమ్మాయిలకు నగదు కానుక.. కుమారస్వామి ఎన్నికల హామీ
- రైతుల కొడుకుల్ని చేసుకునేందుకు యువతులు ముందుకు రావట్లేదని తెలిసిందన్న కుమారస్వామి
- తమ పిల్లల ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకు కొత్త పథకం ప్రవేశపెడతామని వెల్లడి
- రైతు కొడుకును పెళ్లి చేసుకుంటే రూ.2 లక్షలు ఇస్తామని ప్రకటన
- మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్ డీ కుమారస్వామి కీలక హామీ ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే.. రైతుల కొడుకులను పెళ్లి చేసుకునే అమ్మాయిలకు రూ. 2 లక్షలు అందచేస్తామని చెప్పారు. కోలార్‌లో నిర్వహించిన ‘పంచరత్న’ ర్యాలీలో కుమారస్వామి ఈ హామీ ఇచ్చారు.
‘‘రైతుల కొడుకులను పెళ్లి చేసుకునేందుకు యువతులు సుముఖంగా లేరని నా దృష్టికి వచ్చింది. అందుకే రైతుల పిల్లల పెళ్లిళ్లను ప్రోత్సహించేందుకు.. వారిని వివాహం చేసుకునేందుకు ముందుకొచ్చిన యువతులకు మా పార్టీ అధికారంలోకి వస్తే రూ. 2 లక్షల నగదు అందిస్తుంది’’ అని చెప్పారు. మన పిల్లల ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెడతామని తెలిపారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10న జరగనున్నాయి. మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. 224 స్ధానాలున్న కర్ణాటక అసెంబ్లీలో కనీసం 123 స్థానాలను సాధించాలని జేడీ(ఎస్) టార్గెట్ పెట్టుకుంది. ఇప్పటిదాకా 93 మంది అభ్యర్థులను ప్రకటించింది.