కేసీఆర్ ఒక ద్రోహి.. వదిలేస్తే తెలంగాణను అమ్మేస్తాడు: భట్టి విక్రమార్క
- ధరణి పేరుతో భూమిపై హక్కులు లేకుండా చేస్తున్నారని భట్టి మండిపాటు
- రాష్ట్రంలోని సంస్థలను కేసీఆర్ అమ్మకానికి పెట్టేస్తున్నారని విమర్శ
- వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంటూ కొత్త డ్రామాకు తెర లేపారన్న భట్టి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు. ధరణి పేరుతో భూమిపై హక్కులు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. సింగరేణి గనులను ప్రైవేట్ పరం చేస్తున్నది కూడా కేసీఆరే అని ఆరోపించారు. కేసీఆర్ ను ఇలాగే వదిలేస్తే తెలంగాణను అమ్మేస్తారని అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిని అడ్డుకున్న ద్రోహి కేసీఆర్ అని విమర్శించారు. రాష్ట్రంలోని సంస్థలను కేసీఆర్ అమ్మకానికి పెట్టేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ భూములను అమ్మేస్తున్నారని అన్నారు.
రాష్ట్రాన్ని ముంచేస్తున్న కేసీఆర్ ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు బిడ్ వేస్తామంటూ కొత్త డ్రామా మొదలు పెట్టాడని భట్టి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కాళేశ్వరం వల్ల పంటలు ముంపుకు గురి కాకుండా రిటైనింగ్ వాల్ కట్టిస్తామని ఆయన హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోతుందని జోస్యం చెప్పారు. మంచిర్యాల జిల్లాలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.