ఐపీఎల్ లో బీజీగా స్టార్లు.. డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం రంగంలోకి గురువు ద్రవిడ్
- జూన్ 7-11 మధ్య ఆస్ట్రేలియాతో పోటీ పడనున్న టీమిండియా
- మెగా ఫైనల్ కోసం బ్లూ ప్రింట్ సిద్ధం చేయనున్న కోచ్ ద్రవిడ్
- ఎన్ సీఏలో వీవీఎస్ లక్మణ్ తో సమావేశం
భారత స్టార్ క్రికెటర్లంతా ఐపీఎల్‌లో బిజీగా ఉండగా. .హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మాత్రం ఐసీసీ ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ కోసం ప్రణాళికలు రచిస్తున్నారు. లండన్ లోని ఓవల్ వేదికగా జూన్ 7–11 మధ్య జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత్ పోటీ పడనుంది. గత పర్యాయం న్యూజిలాండ్ చేతిలో ఓడిన నేపథ్యంలో ఈసారి ఎలాగైనా ట్రోఫీ నెగ్గాలని ద్రవిడ్ భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడే టీమ్‌లోకి ఎవరిని తీసుకోవాలి? జట్టు ఎలా సన్నద్ధం అవ్వాలి? అనే అంశంపై తన సహచర కోచ్‌లతో కలిసి రాహుల్ బ్లూ ప్రింట్ సిద్ధం చేయనున్నాడు. ఇందుకోసం ద్రవిడ్, ఇతర కోచ్ లు ఈ రోజు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో భేటీ కానుంది.
వీవీఎస్ లక్ష్మణ్ నేతృత్వంలోని ఎన్‌సీఏ జట్టుతో సమావేశమై చర్చించనుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. స్టార్ పేసర్ బుమ్రా, మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్, కీపర్ రిషబ్ పంత్‌కు గాయాలు అవడంతో వారి స్థానాలను భర్తీ చేసే వారిని ఎంచుకోవాల్సి ఉంది. ఐపీఎల్ లో రాణించిన అజింక్యా రహానెను అయ్యర్ స్థానంలో జట్టులోకి తీసుకుంటే ఎలా ఉంటుందనే అంశంపై చర్చించనుంది. అలాగే, వన్డే వరల్డ్ కప్ దృష్ట్యా ఐపీఎల్‌లో ఆడుతున్న స్టార్ క్రికెటర్ల పనిభారాన్ని కూడా ద్రవిడ్ అండ్ కో సమీక్షించనుంది. ద్రవిడ్, లక్ష్మణ్ ఇద్దరూ తమ టీమ్‌లతో కలిసి క్రికెటర్ల పనిభార నిర్వహణ, ఫైనల్‌కు సన్నద్ధమయ్యే ప్రణాళికలపై విస్తృతంగా చర్చిస్తారని బోర్డు వర్గాలు చెబుతున్నాయి.