సమస్యలను ఎదుర్కోవడం అలవాటైంది.. అందుకే స్ట్రాంగ్ అయ్యా: సమంత
- సమస్యలు వచ్చినప్పుడు అందరూ మారుతారన్న సమంత
- తానేమీ స్పెషల్ కాదని వ్యాఖ్య
- శకుంతల పాత్ర నేటి అమ్మాయిలకు కనెక్ట్ అవుతుందని ధీమా
- 14న రిలీజ్ కానున్న శాకుంతలం సినిమా
సమంత ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా మూవీ ‘శాకుంతలం’. మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్ర బృందం ప్రమోషన్లతో బిజీ బిజీగా గడుపుతోంది. ఈ నేపథ్యంలో మీడియాతో సమంత మాట్లాడారు. శాకుంతలం సినిమా, శకుంతల పాత్ర గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు.
శాకుంతలం కథ గురించి చిన్నప్పుడే తనకు కొంత తెలుసని సమంత అన్నారు. ‘‘కాళిదాసు రాసిన కావ్యంలోని కథ ఇది. ఇప్పటి అమ్మాయినైన నేను ఆ క్యారెక్టర్‌తో రిలేట్ అవుతున్నానంటే.. ఆ పాత్ర ఎంత పవర్‌ఫులో అర్థం చేసుకోవచ్చు. శకుంతల పాత్ర నేటి అమ్మాయిలకు కనెక్ట్ అవుతుంది’’ అని చెప్పారు. శకుంతల ఓటమిని అస్సలు ఒప్పుకోదని, తనకు తెలిసి ఆమెనే ఫస్ట్ సింగిల్ మదర్ కావచ్చని అన్నారు. ఇప్పటి మహిళల్లో చాలా మందికి ఆమె పాత్ర కనెక్ట్ అవుతుందని అభిప్రాయపడ్డారు.
ప్రతి సినిమాకు నటిగా తన బెస్ట్ ఇస్తున్నానని సమంత అన్నారు. ‘‘శకుంతల రోల్.. నటిగా నాకు పెద్ద బాధ్యత. అందుకే ముందు నేను భయపడ్డాను. గుణశేఖర్ అడగ్గానే నో చెప్పాను. అంతకుముందే రాజీ పాత్ర చేసి వచ్చాను. దానికి భిన్నంగా శకుంతల పాత్రలో చాలా అందంగా కనిపించాలి. ప్రతి ఫ్రేమ్‌లో అందంతోపాటు పాత్రలో ఓ డిగ్నిటీ, గ్రేస్ కనపడాలి. నేను ఆ పాత్రకు న్యాయం చేశాననే అనుకుంటున్నాను’’ అని వివరించారు.
ఒకప్పుడు అమాయకంగా కనిపించిన సమంత ఇంత ధైర్యవంతురాలిగా ఎలా మారిందని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ‘‘అప్పుడు నాకు ఇన్ని సమస్యలు లేవు. అమాయకత్వంగా ఉన్నాను. అన్నీ ఉన్నాయి.. హ్యాపీగా ఉన్నాను. అదే తెరపై కనపడేది. ఇప్పుడు అలా లేదు. ఇలాంటి పరిస్థితి వస్తుందని నాకు తెలియదు. ఈ ప్రయాణంలో నేను ఎదుర్కొన్న సమస్యల వల్ల చాలా విషయాలు తెలిశాయి. అందుకే ఇలా మారిపోయాను. సమస్యలు వచ్చాయి.. ఎదుర్కొంటున్నాను. అలవాటైంది. సమస్యలు వచ్చినప్పుడు అందరూ మారుతారు. నేనేమీ స్పెషల్ ఏమీ కాదు. అమాయకమైన సమంత ఇప్పుడు స్ట్రాంగ్ అయింది’’ అని చెప్పుకొచ్చారు.