మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు బీజేపీ నేత డీకే అరుణ ఫోన్
- మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుపై టీఆర్ఎస్ వేటు
- బీజేపీలోకి రావాలంటూ డీకే అరుణ జూపల్లికి ఫోన్ చేసినట్టు వార్త వైరల్
- ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని జూపల్లి జవాబు
టీఆర్‌ఎస్‌లో వేటు పడ్డ మాజీ మంత్రి, సీనియర్ నేత జూపల్లి కృష్ణారావుకు బీజేపీ నేత డీకే అరుణ ఫోన్ చేశారన్న వార్త ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. టీఆర్‌ఎస్ వేటు వేసిన 24 గంటల్లోపే ఆయనకు బీజేపీ నేత నుంచి ఫోన్ వెళ్లడం రాజకీయవర్గాల్లో చర్చకు దారి తీసింది. బీజేపీలో చేరాలంటూ డీకే అరుణ ఆయనను ఆహ్వానించినట్టు సమాచారం. అయితే..దీనిపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని ఆయన బదులిచ్చారట.
డీకే అరుణ, జూపల్లి కృష్ణా రావు ఇద్దరిదీ మహబూబ్ నగర్ జిల్లానే. గతంలో కాంగ్రెస్ పార్టీలో కలిసి పనిచేసిన ఈ ఇద్దరు నేతల మధ్య కోల్డ్ వార్ నడిచేదని ఓ టాక్. ఆ తరువాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారడంతో డీకే అరుణ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. జూపల్లి కృష్ణా రావు గులాబీ గూటికి చేరుకున్నారు. గత ఎన్నికల్లో ఇద్దరు నేతలూ ఓడిపోయారు. అయితే.. టీఆర్‌ఎస్ పార్టీలో జూపల్లికి ఎదురుగాలులు మొదలయ్యాయి. చివరకు అధిష్ఠానం వేటు వేయడంతో ఆయన టీఆర్‌ఎస్‌ను వీడారు. డీకే అరుణ మాత్రం బీజేపీలో కొనసాగుతున్నారు. ఇక పార్టీ ఆదేశాలతోనే డీకే అరుణ జూపల్లికి ఫోన్ చేశారా? ఇద్దరు నేతలు పాత వైరాలను పక్కనపెట్టేశారా? అని స్థానికులు చర్చించుకుంటున్నారు.