ఆర్సీబీ కెప్టెన్ కు షాకిచ్చిన మ్యాచ్ రిఫరీ

  • స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా విధింపు
  • మొదటి తప్పు కావడంతో రూ. 12 లక్షల జరిమానా
  • మ్యాచ్ తర్వాత అతి చేసిన అవేశ్ ఖాన్ కు మందలింపు
సొంతగడ్డపై నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో పరాజయం పాలైన బెంగళూరుకు మ్యాచ్ రిఫరీ షాకిచ్చాడు. స్లో ఓవర్ రేట్ కారణంగా ఆ జట్టు కెప్టెన్ ఫా డుప్లెసిస్ కు భారీ జరిమానా విధించింది. నిర్ణీత సమయంలో బౌలింగ్ పూర్తి చేయకపోవడంతో ఫీల్డ్ చివరి ఓవర్లో సర్కిల్ బయట నలుగురు ఫీల్డర్లనే అనుమతించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత భారీ స్లో ఓవర్ రేట్ ఉండటంతో మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకున్నాడు. ఇదే తొలి తప్పిదం కావడంతో రూ.12 లక్షల జరిమానా విధించాడు. ఈ సీజన్ లో జరిమానా ఎదుర్కొన్న మొదటి కెప్టెన్ డుప్లెసిస్ కావడం గమనార్హం. 

మరోవైపు అలాగే చివరి బంతికి విజయం సాధించడంతో లక్నో ఆటగాడు అవేశ్ ఖాన్ హెల్మెట్‌ను నేలకు విసిరి కొట్టాడు. దాంతో, అది అతడి మొదటి తప్పిదంగా భావించి అతడిని రిఫరీ మందలించి వదిలేశాడు. కాగా, ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 20 ఓవర్లలో 212 పరుగుల భారీ స్కోరు సాధించింది. కోహ్లీ (61), డుప్లెసిస్ (79 నాటౌట్), మ్యాక్స్‌వెల్ (59) రాణించారు. ఛేజింగ్‌కు దిగిన లక్నో టీమ్ ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది. ఆరంభంలో వికెట్లు కోల్పోయినా స్టోయినిస్ (65), పూరన్ (62) సంచలన ఇన్నింగ్స్‌లతో ఉత్కంఠ విజయం సాధించింది.


More Telugu News