రాహుల్ గాంధీకి కౌంటర్ ఇచ్చిన గౌతమ్ అదానీ కంపెనీ

  • అదానీ షెల్ కంపెనీల్లో 20 వేల కోట్ల పెట్టుబడులు ఎవరు పెట్టారన్న రాహుల్
  • 2019 నుంచి తమ లావాదేవీల వివరాలను తెలిపిన అదానీ గ్రూప్
  • ఫైనాన్సియల్ టైమ్స్ కథనాన్ని తప్పుపట్టిన అదానీ గ్రూప్
బిలియనీర్ గౌతమ్ అదానీకి చెందిన షెల్ కంపెనీలలో 20 వేల కోట్ల పెట్టుబడులు ఎవరు పెట్టారంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ గా అదానీ గ్రూప్ తమకు పెట్టుబడులు ఎలా వచ్చాయో వెల్లడించింది. 2019 నుంచి గ్రూప్ సంస్థలలో 2.87 బిలియర్ డాలర్ల వాటా విక్రయాల వివరాలను... 2.55 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఎలా వచ్చాయనే విషయాలను వివరించింది. 

 మరోవైపు తమ గ్రూప్ లోకి విదేశీ పెట్టుబడులపై ఫైనాన్సియల్ టైమ్స్ ప్రచురించిన నివేదికను కూడా అదానీ గ్రూప్ ఖండించింది. తమ గ్రూప్ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నమని విమర్శించింది. స్టాక్ మార్కెట్ లో తమ గ్రూప్ పరపతిని తగ్గించేందుకు యత్నిస్తున్నారని వ్యాఖ్యానించింది. అదానీ అంశాన్ని రాజకీయం చేస్తున్నారని చెప్పారు. అందుకే ఈ వివరాలను వెల్లడిస్తున్నామని తెలిపారు.


More Telugu News