ట్విట్టర్ లో మోదీని ఫాలో అవడం ప్రారంభించిన ఎలాన్ మస్క్
- ఇటీవల ట్విట్టర్ ను కొనుగోలు చేసిన ఎలాన్ మస్క్
- ట్విట్టర్ లో 195 మందిని ఫాలో అవుతున్న మస్క్
- 195 మంది జాబితా స్క్రీన్ షాట్ ట్విట్టర్ లో వైరల్
గతంలో అప్పుడప్పుడు వార్తల్లో కనిపించిన అపర కుబేరుడు ఎలాన్ మస్క్, ట్విట్టర్ ను కొనుగోలు చేశాక దాదాపు ప్రతిరోజు మీడియా ఐటమ్ గా దర్శనమిస్తున్నాడు. తన ట్రేడ్ మార్కు నిర్ణయాలను ట్విట్టర్ ను కుదుపులకు గురిచేస్తున్న ఎలాన్ మస్క్... తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీని ట్విట్టర్ లో ఫాలో అవడం ద్వారా మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాడు.
ఎలాన్ మస్క్ ట్విట్టర్ లో 195 మందిని ఫాలో అవుతున్నారు. మస్క్ ఫాలో అయ్యే వారి జాబితా స్క్రీన్ షాట్ ట్విట్టర్ లో సందడి చేస్తోంది. ఆ జాబితాలో మోదీ పేరు కూడా ఉంది. కాగా, ట్విట్టర్ లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న వ్యక్తి ఎలాన్ మస్కే. ఆయనను ట్విట్టర్ లో 134.3 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు.
కాగా, మస్క్ ఇప్పుడు భారత ప్రధానిని ఫాలో అవుతుండడం పట్ల నెటిజన్లు తలోరకంగా స్పందిస్తున్నారు. కొందరేమో... త్వరలో మస్క్ తన టెస్లా ఫ్యాక్టరీని భారత్ లో స్థాపిస్తాడనుకుంటా అని వ్యాఖ్యానించగా, మరికొందరు ఇది ఆశ్చర్యకరమైన పరిణామం అని పేర్కొన్నారు.
ఇంకొందరు... మోదీ భారత్ ను మెరుగైన దేశంగా తీర్చిదిద్దుతుండడమే అందుకు కారణమని వ్యాఖ్యానిస్తున్నారు.