ఐపీఎల్-16: బెంగళూరుపై టాస్ గెలిచిన సూపర్ జెయింట్స్
- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు × లక్నో సూపర్ జెయింట్స్
- బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సూపర్ జెయింట్స్
ఐపీఎల్ తాజా సీజన్ లో నేడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ అమీతుమీకి సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్ కు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా నిలుస్తోంది. టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ బౌలింగ్ ఎంచుకుంది. రెండు జట్లలోనూ ఆల్ రౌండర్లు పుష్కలంగా ఉండడంతో మ్యాచ్ లో ఆసక్తికర పోరు తప్పదనిపిస్తోంది.
బెంగళూరు జట్టులో కోహ్లీ, డుప్లెసిస్, మ్యాక్స్ వెల్, దినేశ్ కార్తీక్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉండగా... సూపర్ జెయింట్స్ కు కేఎల్ రాహుల్, కైల్ మేయర్స్, నికోలాస్ పూరన్, మార్కస్ స్టొయినిస్ వంటి కీలక ఆటగాళ్లు అండగా ఉన్నారు. బౌలింగ్ లో మహ్మద్ సిరాజ్, డేవిడ్ విలీ, వేన్ పార్నెల్ బెంగళూరు బౌలింగ్ భారం మోయనున్నారు.
సూపర్ జెయింట్స్ జట్టులో మార్క్ వుడ్, అవేశ్ ఖాన్, జయదేవ్ ఉనద్కట్ వంటి స్టార్ పేసర్లు... అమిత్ మిశ్రా, రవి బిష్ణోయ్ వంటి ప్రతిభావంతులైన లెగ్ స్పిన్నర్లు ఉన్నారు. బౌలింగ్ పరంగా చూస్తే బెంగళూరు కంటే సూపర్ జెయింట్స్ మెరుగ్గా కనిపిస్తోంది.