తెలంగాణ హైకోర్టులో అవినాశ్ రెడ్డి మధ్యంతర పిటిషన్
- వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డిని పలుమార్లు ప్రశ్నించిన సీబీఐ
- విచారణ వివరాలు కోరిన అవినాశ్ రెడ్డి
- ఆడియో, వీడియో రికార్డింగ్ లు సమర్పించేలా సీబీఐని ఆదేశించాలని పిటిషన్
మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని పలుమార్లు విచారించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎంపీ అవినాశ్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. వివేకా హత్య కేసు విచారణకు సంబధించిన వివరాలు ఇచ్చేలా సీబీఐని ఆదేశించాలని తన పిటిషన్ లో కోరారు.
ఈ కేసులో చివరిసారిగా అవినాశ్ రెడ్డిని సీబీఐ గత నెల 14న హైదరాబాదులో విచారించింది. ఆ విచారణకు సంబంధించిన ఆడియో, వీడియో రికార్డులు సమర్పించేలా సీబీఐని ఆదేశించాలని ఎంపీ అవినాశ్ రెడ్డి తన మధ్యంతర పిటిషన్ లో కోర్టును కోరారు.