ధర్మపురి నియోజకవర్గ ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూం తాళం చెవి మిస్సింగ్

  • ధర్మపురి నియోజవకర్గంలో రీకౌంటింగ్ జరపాలన్న హైకోర్టు
  • తాళం చెవిలేకపోవడంతో పగులగొట్టేందుకు అధికారుల యత్నం
  • అంగీకరించని కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్
  • ధర్మపురి నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన లక్ష్మణ్
  • 441 ఓట్ల తేడాతో ఓటమి
  • కౌంటింగ్ లో అవకతవకలు జరిగాయని హైకోర్టును ఆశ్రయించిన లక్ష్మణ్
గత అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జగిత్యాల ధర్మపురి నియోజకవర్గం ఓట్ల లెక్కింపు సరిగా జరగలేదని, అవకతవకలు చోటుచేసుకున్నాయని కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. 

నాటి ఎన్నికల్లో లక్ష్మణ్ కేవలం 441 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. ఈ నేపథ్యంలో, ధర్మపురి నియోజకవర్గం ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూం తెరవాలని హైకోర్టు ఆదేశించింది. దాంతో రీకౌంటింగ్ పై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. 

అయితే, వీఆర్కే కాలేజీలోని ఈ స్ట్రాంగ్ రూం తాళం చెవి కనిపించడంలేదన్న వార్త కలకలం రేపింది. తాళం చెవి లేకపోవడంతో తాళం పగులగొట్టేందుకు అధికారులు ప్రయత్నించారు. అందుకు పిటిషనర్ అడ్లూరి లక్ష్మణ్ అంగీకరించలేదు. ఎంతో కీలకమైన స్ట్రాంగ్ రూమ్ తాళం చెవిని కాపాడాల్సిన అధికారుల తీరుపై ఆయా పార్టీల అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


More Telugu News