బీఆర్ఎస్ నుంచి తనను సస్పెండ్ చేయడంపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందన

  • బీఆర్ఎస్ నుంచి పొంగులేటి, జూపల్లి సస్పెన్షన్
  • ఇన్ని రోజులకు తనకు బీఆర్ఎస్ నుంచి విముక్తి లభించిందన్న పొంగులేటి
  • తనను ఇప్పటికైనా సస్పెండ్ చేయడం సంతోషంగా ఉందని వ్యాఖ్య
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పొంగులేటి మాట్లాడుతూ, ఇన్ని రోజులకు తనకు బీఆర్ఎస్ నుంచి విముక్తి లభించిందని చెప్పారు. బీఆర్ఎస్ నుంచి తనను ఇప్పటికైనా సస్పెండ్ చేయడం సంతోషకరమని అన్నారు. దొరల గడీ నుంచి తనకు విముక్తి లభించినందుకు ఆనందంగా ఉందని చెప్పారు. 

నిన్న కొత్తగూడెంలోని ప్రకాశం మైదానంలో తన మద్దతుదారులతో పొంగులేటి ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి జూపల్లి హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరు ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో వీరిద్దరిపై బహిష్కరణ వేటు పడింది. చాలా కాలంగా వీరిద్దరూ బీఆర్ఎస్ అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.


More Telugu News