దేశంలో మళ్లీ పంజా విసురుతున్న కరోనా... ఒకే రోజు 14 మంది మృతి
- గత 24 గంటల్లో 5,880 కేసుల నమోదు
- 35,199కి చేరుకున్న యాక్టివ్ కేసులు
- 6.91 శాతంగా ఉన్న డైలీ పాజిటివిటీ రేటు
మన దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 5,880 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో కరోనా కారణంగా 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఢిల్లీకి చెందిన నలుగురు, హిమాచల్ ప్రదేశ్ కు చెందిన నలుగురు ఉన్నారు. కేరళలో ఇద్దరు చనిపోయారు. జమ్మూకశ్మీర్, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్ లతో ఒక్కో మరణం సంభవించింది.
తాజా కేసులతో కలిపి స్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 35,199కి చేరుకుంది. తాజా మరణాలతో ఇప్పటి వరకు నమోదైన మరణాల సంఖ్య 5,30,979కి చేరింది. ఇప్పటి వరకు 4,47,62,496 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం డైలీ పాజిటివిటీ రేటు 6.91 శాతంగా ఉంది. ఈ వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.