కేసీఆర్ అందుకోసమే మూడోసారి సీఎం కావాలనుకుంటున్నారు: పొంగులేటి ఫైర్
- కొత్తగూడెం ప్రకాశం మైదానంలో పొంగులేటి ఆత్మీయ సమ్మేళనం
- రాష్ట్రంలో ఇప్పుడు కుటుంబ పాలన నడుస్తోందన్న పొంగులేటి
- కేసీఆర్‌లో నిజాయతీ లోపించిందన్న జూపల్లి
వరుసగా మూడోసారి కూడా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించాలనుకుంటున్న కేసీఆర్ కలలు పగటి కలలుగా మిగిలిపోవడం ఖాయమని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కొత్తగూడెం ప్రకాశం మైదానంలో నిన్న తన మద్దతుదారులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. కుటుంబ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే కేసీఆర్ మూడోసారి కూడా సీఎం అవుదామని అనుకుంటున్నారని అన్నారు.
అన్ని వర్గాల ప్రజలు, బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల సహకారంతోనే రాష్ట్రం సాధించుకున్నామన్న సంగతిని కేసీఆర్ మర్చిపోతున్నారని అన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు కుటుంబ పాలన సాగుతోందన్నారు. టీఆర్ఎస్ స్థానంలో బీఆర్ఎస్ వచ్చినప్పుడే కేసీఆర్ గాడితప్పారని విమర్శించారు.
ఈ సమావేశానికి హాజరై సంఘీభావం ప్రకటించిన జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌లో నిజాయతీ లోపించిందన్నారు. సాగునీటి టెండర్లలో మాయాజాలం ప్రదర్శిస్తూ వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని జూపల్లి ఆరోపించారు.