లోకేశ్ పాదయాత్ర నేపథ్యంలో ఎమ్మెల్యే కేతిరెడ్డికి జేసీ వార్నింగ్
- తాడిపత్రిలో పొలిటికల్ హీట్ పెంచిన లోకేశ్ పాదయాత్ర
- జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిపెద్ది పెద్దారెడ్డి మధ్య మాటలయుద్ధం
- ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదంటూ పెద్దారెడ్డి గుస్సా
- లోకేశ్ దగ్గరే తేల్చుకుంటానంటూ పెద్దారెడ్డి అల్టిమేటం
- లోకేశ్ క్యాంప్ వద్దకు వచ్చి చూస్తే నీకే తెలుస్తుందంటూ జేసీ కౌంటర్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పాదయాత్రతో తాడిపత్రిలో పొలిటికల్ హీట్ పతాకస్థాయికి చేరుకుంది. తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి, ప్రతిపక్ష నేత జేసీ దివాకర్ రెడ్డి సవాళ్లు ప్రతిసవాళ్లతో రాజకీయకాక రేపుతున్నారు.
ఇక నారా లోకేశ్ ను టార్గెట్ చేస్తూ కేతిరెడ్డి పెద్దారెడ్డి రెచ్చిపోయారు. తనపై భూకబ్జా ఆరోపణలు చేసినందుకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నీకు దమ్ముంటే ఆధారాలతో సహా రా.. నేను తప్పు చేశానని నిరూపించు.. స్పాట్‌లో సారీ చెబుతా.. లేదంటే తాడిపత్రిలో పాదయాత్ర బంద్ చేయ్' అంటూ లోకేశ్‌కు సవాల్ విసిరే ప్రయత్నం చేశారు. ఆధారాల్లేకుండా ఆరోపణలు చేస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు. లోకేశ్ దగ్గరే తేల్చుకుంటానంటూ అల్టిమేటం ఇచ్చారు. అదే స్పీడులో జేసీ బ్రదర్స్‌పైనా విమర్శలు గుప్పించారు. జేసీ బ్రదర్స్ భూకబ్జాల గురించి లోకేశ్‌కు తెలుసా? అంటూ నిలదీశారు. వాళ్ల భూకబ్జాలపై ఆధారాలు తానిస్తానంటూ సవాల్ విసిరారు.
కేతిరెడ్డి ఆరోపణలపై..జేసీ ప్రభాకర్ కూడా అదే రేంజ్‌లో సమాధానమిచ్చారు. తాడిపత్రి సెంటర్‌కు వస్తే పంచె ఊడదీసి కొట్టడానికి జనం రెడీగా ఉన్నారంటూ మండిపడ్డారు. ‘‘లోకేశ్ యాత్రను అడ్డుకునే దమ్ముందా..అసలు లోకేశ్ క్యాంప్ దగ్గరకు వచ్చిచూడు. నీకు ఏమవుతుందో తెలుస్తుందంటూ కౌంటర్ ఇచ్చారు.