ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ తరఫున వలంటీర్లు ప్రచారం చేశారు: అచ్చెన్నాయుడు
- రాష్ట్ర సీఎస్ కు లేఖ రాసిన అచ్చెన్నాయుడు
- వలంటీర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని వెల్లడి
- ప్రభుత్వం జీతాలు ఇచ్చి పార్టీ సేవ చేయించుకుంటారా అని ఆగ్రహం
వలంటీర్ల వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ తరఫున వలంటీర్లు ప్రచారం చేశారని ఆరోపించారు. ఈ మేరకు రాష్ట్ర సీఎస్ జవహర్ రెడ్డికి లేఖ రాశారు.
ప్రభుత్వం జీతాలు ఇచ్చి పార్టీ సేవ చేయించుకోవడం ఇదే తొలిసారి అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వలంటీర్లకు ఏటా రూ.2 వేల కోట్లు దోచిపెడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ పాలన సవ్యంగా నడిచేందుకు వీలుగా, వలంటీర్లను కట్టడి చేయాలని తన లేఖలో కోరారు. వలంటీర్ వ్యవస్థ దుర్వినియోగం కాకుండా చూడాలని తెలిపారు.