తోపులాటలో ఫోన్ పోయిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన బండి సంజయ్
- తెలంగాణలో టెన్త్ క్లాస్ హిందీ పేపర్ లీక్
- ఈ నెల 5న బండి సంజయ్ అరెస్ట్
- బీజేపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట
తెలంగాణలో టెన్త్ క్లాస్ హిందీ ప్రశ్నాపత్రం లీక్ కావడం, తదనంతర పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ ని అరెస్ట్ చేయడం తెలిసిందే. అయితే, తన ఫోన్ పోయిందంటూ బండి సంజయ్ తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 5న తనను అరెస్ట్ చేశారని, ఆ సందర్భంగా బీజేపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగిందని బండి సంజయ్ వెల్లడించారు. ఆ తోపులాటలో తన ఫోన్ పడిపోయిందని వివరించారు.
ఇటీవల వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, బండి సంజయ్ ఫోన్ అప్పగించి విచారణకు సహకరించాలని కోరారు. ఫోన్ అడిగితే లేదంటున్నారని ఆరోపించారు. కుట్రకోణం లేకపోతే బండి సంజయ్ తన ఫోన్ ఇవ్వొచ్చు కదా అని సీపీ వ్యాఖ్యానించారు. ఇప్పుడు, బండి సంజయ్ తన ఫోన్ పోయిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఆసక్తికరంగా మారింది.