ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం నిర్ణయం
- డిమాండ్ సాధన కోసం ఉద్యోగుల ఉద్యమ బాట
- నేడు ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం
- ఉద్యోగులతో కలిసి నడవాలని నిర్ణయం
సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమం చేపడుతున్న సంగతి తెలిసిందే. కాగా, ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం నిర్ణయించింది. ఇవాళ ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర కార్యవర్గం సమావేశంపై చర్చించింది. ప్రభుత్వ ఉద్యోగులతో కలిసి నడవాలని తీర్మానించింది.
దీనిపై ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పందించారు. ఉద్యమంలో ఉపాధ్యాయుల పాత్ర కూడా ఉండాలని కోరుతున్నామని తెలిపారు. రేపు స్పందన కార్యక్రమంలో కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేస్తామని వెల్లడించారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు. ఆర్థికపరమైన అంశాలలో ఏపీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంలేదని అన్నారు.