వేషం మారింది.. నీడ ఒక్కటే.. మోదీపై కాంగ్రెస్ విమర్శలు
- కర్ణాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో పర్యటించిన మోదీ
- ప్రధాని ఫొటోను ఎడిట్ చేసి ట్వీట్ చేసిన కాంగ్రెస్
- ప్రచార మంత్రా? ప్రధాన మంత్రా? అంటూ ప్రకాశ్ రాజ్ సెటైర్లు
ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు కర్ణాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో జంగిల్ సఫారీ చేశారు. దాదాపు 20 నిమిషాలపాటు జీపులో పార్క్ లోపల తిరిగారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను బీజేపీ వైరల్ చేస్తోంది. మరోవైపు వాటిని ఎడిట్ చేసి కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది.
జంగిల్ సఫారీలో ప్రధాని మోదీ దిగిన ఫొటోను ఎడిట్ చేసి కాంగ్రెస్ ట్వీట్ చేసింది. మోదీ నడిచి వస్తున్నట్లుగా ఉన్న ఫొటోకు నీడగా ‘గౌతమ్ అదానీ’ లాంటి రూపాన్ని ఇచ్చింది. దీనికి ‘వేషం మారింది.. కానీ నీడ ఒక్కటే’ అని హిందీలో క్యాప్షన్ ఇచ్చింది.
మరోవైపు కర్ణాటకకు చెందిన ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా ప్రధాని పర్యటనపై విమర్శలు చేశారు. ‘నేనెవరో కనుక్కోండి.. ప్రచార మంత్రినా, ప్రధాన మంత్రినా?’ అంటూ ట్వీట్ చేశారు. ‘బందీపూర్ ఫైల్స్.. మిస్ కాకండి’ ఫైల్స్ అంటూ ఓ వీడియోను పోస్ట్ చేశారు.