వారసత్వ రాజకీయాలని అప్పుడు అనిపించలేదా?.. ప్రధాని మోదీపై కపిల్ సిబల్ మండిపాటు
- వారసత్వ రాజకీయాలపై మోదీ వ్యాఖ్యలకు కపిల్ సిబల్ కౌంటర్
- అనుకూల రాజకీయాలకు బీజేపీ పాల్పడుతోందని వ్యాఖ్య
- బీజేపీకి, ప్రధానికి ట్విట్టర్ లో ప్రశ్నలు
అనుకూల రాజకీయాలకు బీజేపీ పాల్పడుతోందని కాంగ్రెస్ నేత, రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ మండిపడ్డారు. వారసత్వ రాజకీయాలపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. కుటుంబ రాజకీయాలు చేస్తున్న పార్టీలతో గతంలో బీజేపీ చేతులు కలిపిన విషయాన్ని గుర్తు చేశారు. ఆదివారం ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు.
‘‘అవినీతి, కుటుంబ పాలన కలిసే ఉంటాయని కేసీఆర్ ను ఉద్దేశిస్తూ ప్రధాని విమర్శించారు. మరి పంజాబ్ (అకాళీలు), ఆంధ్రప్రదేశ్ (జగన్), హర్యానా (చౌతాలాలు), జమ్మూకశ్మీర్ (ముఫ్తీలు), మహారాష్ట్ర (థాకరేలు)లో బీజేపీ ఎందుకు ఆయా పార్టీలతో చేతులు కలిపింది. వాటితో బీజేపీ కలిసినప్పుడు వారివి వారసత్వ రాజకీయాలు కాదా?’’ అని ప్రశ్నించారు. ‘‘వీటినే అనుకూల రాజకీయాలని అంటారు’’ అని ఎద్దేవా చేశారు.
‘‘ఆమ్ ఆద్మీ పార్టీపైనా బీజేపీ అవినీతి ఆరోపణలు చేస్తోంది. అక్కడ వారసత్వ రాజకీయాలులేవు. అవినీతి ఆరోపణలు చేయడానికి వారసత్వ రాజకీయాలు ఉండాల్సిన అవసరం లేదు. బీజేపీ వారసత్వ రాజకీయాలు చేయదని మీరు అంటున్నారు.. మరి బీజేపీ అవినీతికి పాల్పడిందా?’’ అని ప్రశ్నించారు.