పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పై మండిపడ్డ రేణుదేశాయ్

  • మాట్లాడే పద్ధతి నేర్చుకోవాలంటూ హితవు
  • మీ అన్న కొడుకు కాదు.. వాడు నా బిడ్డ అని సరిదిద్దిన మాజీ హీరోయిన్
  • అకీరానందన్ బర్త్ డే సందర్భంగా ట్విట్టర్లో పవన్ అభిమాని కామెంట్
  • పదకొండేళ్లుగా సంయమనంతో ఉంటున్నా.. కానీ తల్లిగా ఆవేదన చెందుతున్నా: రేణు దేశాయ్
పవన్ కల్యాణ్ అభిమానులపై రేణుదేశాయ్ మండిపడ్డారు. మా అన్న (పవన్ కల్యాణ్) కొడుకును అప్పుడప్పుడైనా సోషల్ మీడియాలో చూపించాలని అడిగిన నెటిజన్ పై ఫైర్ అయ్యారు. మీ అన్న కొడుకు కాదు.. వాడు నా బిడ్డ అంటూ జవాబిచ్చారు. మాట్లాడే పద్ధతి నేర్చుకోవాలని హితవు చెప్పారు. శనివారం అకీరానందన్ పుట్టినరోజు సందర్భంగా ఈ వివాదం చోటుచేసుకుంది.

అకీరానందన్ పుట్టిన రోజు సందర్భంగా శనివారం రేణుదేశాయ్ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. 19 ఏళ్లు వచ్చినా అకీరా నాకు ఇప్పటికీ పసిబిడ్డేనని అందులో రాసుకొచ్చారు. దీంతో అకీరాకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. రేణుదేశాయ్ అభిమానులతో పాటు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అకీరాకు శుభాకాంక్షలు చెబుతూ కామెంట్లు పెట్టారు. అయితే, ఓ అభిమాని పెట్టిన కామెంట్ పై రేణుదేశాయ్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

‘మేడమ్‌.. ఇది చాలా అన్యాయం. మా అకీరాను ఒక్కసారి అయినా చూపించండి మా అన్న (పవన్‌ కల్యాణ్‌) కొడుకును చూడాలని మాకు ఉంటుంది. దయచేసి మీరు హైడ్‌ చేయకండి’ అని ఓ అభిమాని ఇన్ స్టాలో మెసేజ్ చేశాడు. అకీరా బాబును అప్పుడప్పుడైనా వీడియోల్లో చూపించండని మరో నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. దీనిపై రేణుదేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సదరు అభిమానికి బదులిస్తూ.. ‘మీ అన్న కొడుకా? అకీరా నా కొడుకు. మీరు ఒక తల్లికి పుట్టలేదా. మీరు హార్డ్‌ కోర్‌ ఫ్యాన్స్‌ అని నాకు తెలుసు. అయినా సరే మీరు మాట్లాడే పద్థతి నేర్చుకోవాలి. మీ అభిమానం నేను అర్థం చేసుకుంటున్నా కాబట్టే చాలావరకు మౌనం ఆశ్రయిస్తున్నా. మెసేజ్ లు డిలీట్ చేస్తున్నా. కానీ కొందరు హద్దుమీరి కామెంట్లు పెడుతున్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇప్పుడు కూడా నా కొడుకు బర్త్ డే రోజు నెగెటివ్ కామెంట్స్ తో ఇబ్బంది పెడుతున్నారు. నన్ను ఒక చెడ్డదానిలా చూస్తున్నా సరే పదకొండేళ్లుగా భరిస్తున్నా.. కానీ ఇప్పుడు ఓ తల్లిగా చాలా హర్ట్ అవుతున్నా. ఇలాంటి వారితో విసిగెత్తిపోయాను. అసలు ఈ జనాల సమస్య ఏంటనేది నాకు అర్థం కావడంలేదు’ అంటూ రేణు దేశాయ్ ఆవేదన వ్యక్తం చేశారు.


More Telugu News