బౌలర్లను ధోనీ అద్భుతంగా వాడాడు: రవిశాస్త్రి పొగడ్త
- వారు మంచి ఫలితాలు రాబడతారని ధోనీకి తెలుసన్న రవిశాస్త్రి
- అందుకే వారి పట్ల నమ్మకాన్ని ఉంచాడన్న అభిప్రాయం
- వీరిద్దరూ ఐదు వికెట్లు తీయడంతో ముంబైకి ఖాయమైన ఓటమి
చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు బౌలింగ్ స్క్వాడ్ అంత బలంగా లేదు. అయినా కానీ, వారి నుంచి వాంఖడే స్టేడియంలో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అద్భుతమైన ఫలితాలు రాబట్టాడు. దీంతో సొంత మైదానంలో ముంబై ఇండియన్స్ జట్టును చెన్నై సూపర్ కింగ్స్ మట్టి కరిపించింది. ముంబై ఇండియన్స్ కు ఇది వరుసగా రెండో ఓటమి కాగా, చెన్నై జట్టుకు వరుసగా రెండో విజయం దక్కింది.
ధోనీ పనితీరుపై ప్రముఖ మాజీ క్రికెటర్, కామెంటేటర్ రవిశాస్త్రి కూడా ప్రశంసల వర్షం కురిపించారు. పవర్ ప్లే తర్వాత మిచెల్ శాంటనర్, రవీంద్ర జడేజా ఐదు వికెట్లు తీసి ముంబై ఇండియన్స్ ఓటమిని శాసించారనే చెప్పుకోవాలి. ‘‘శాంటనర్, జడేజాని ముంబై ఇండియన్ బ్యాటర్లపై రవీంద్ర జడేజా చాలా అద్భుతంగా ప్రయోగించాడు. ఆ తరహా వికెట్ పై ఈ ఇద్దరు మంచి ఫలితాలు రాబడతారని అతడికి తెలుసు. అందుకే వారి పట్ల అతడు మరింత నమ్మకాన్ని ఉంచాడు’’అని స్టార్ స్పోర్ట్స్ ఛానల్ తో మాట్లాడిన సందర్భంగా రవిశాస్త్రి వ్యాఖ్యానించడం గమనార్హం. ముంబై బ్యాటర్ల భరతాన్ని శాంటనర్, జడేజా పడితే.. ముంబై బౌలర్లను అజింక్య రహానే ఉతికి ఆరేశాడు. దీంతో చెన్నైకి చక్కని విజయం సాకారమైంది.