‘అల్బేలా.. అల్బేలా.. హల్ చల్ చేద్దాం క్రేజీగా’.. ఆకట్టుకుంటున్న ‘ఉగ్రం’ సాంగ్.. మీరూ చూసేయండి!
- విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఉగ్రం’ సినిమా
- తాజాగా వీడియో సాంగ్ ను రిలీజ్ చేసిన మేకర్స్
- మే 5న ప్రేక్షకుల ముందుకు మూవీ
పేరుకు తగ్గట్లే కామెడీతో అల్లరి చేసే.. ‘అల్లరి’ నరేశ్ ఇటీవల రూట్ మార్చాడు. కామెడీ ట్రాక్ వదిలి.. ‘నాంది’, ‘ఇట్లు మారేడు నియోజకవర్గం’ వంటి సీరియస్ సినిమాలు చేశాడు. ఇప్పుడు ‘ఉగ్రం’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.
నాంది సినిమాకు దర్శకత్వం వహించిన విజయ్ కనకమేడల.. ‘ఉగ్రం’ను కూడా తెరకెక్కిస్తున్నాడు. మిర్నా మేనన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా మే 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుంచి ‘అల్బేలా.. అల్బేలా.. హల్ చల్ చేద్దాం క్రేజీగా..’ అంటూ సాగే వీడియో సాంగ్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది.
శ్రీచరణ్ పాకల ఇచ్చిన ట్యూన్ ఫ్రెష్ గా ఉంది. పాటను విదేశీ లొకేషన్లలో బ్యూటిఫుల్ గా విజువలైజ్ చేశారు. మధ్యలో వచ్చే చిన్నారి స్టెప్స్ ఆకట్టుకుంటున్నాయి.