యాదాద్రి ఆలయంపై డ్రోన్ ప్రయోగం
- యాద్రాద్రిలో డ్రోన్ కలకలకం
- యాదాద్రి ఆలయంపై డ్రోన్ ప్రయోగించిన ఇద్దరు యువకులు
- యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, డ్రోన్ సీజ్
- నిందితులిద్దరూ హైదరాబాద్ వాసులుగా గుర్తింపు
యాదాద్రిలో తాజాగా డ్రోన్ కలకలం రేగింది. యాదాద్రి ఆలయంపై డ్రోన్ ప్రయోగించిన ఇద్దరు యువకులను స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. యువకులిద్దరూ హైదరాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు యువకులు డ్రోన్ ఎందుకు ప్రయోగించారో తేల్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇక డ్రోన్ వినియోగానికి సంబంధించి కేంద్రం సవివరమైన నిబంధనలు రూపొందించింది. యూజర్లు తమ పేరు, డ్రోన్ వివరాలను డిజిటల్ స్కై ప్లాట్‌ఫాంలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వాటికి ప్రత్యేక యూఐఎన్ సంఖ్య, యూఏఓపీ లైసెన్స్‌ను కేటాయిస్తారు.