ఉంటే ఉండండి.. పోతే పొండి.. బొత్స సత్యనారాయణ సంచలన కామెంట్స్
- విజయనగరం జిల్లా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి
- స్థానిక సమస్యల గురించి చెప్పుకునేందుకు ఎగబడ్డ కార్యకర్తలు
- పార్టీ కార్యకర్తల్లో క్రమశిక్షణ లోపించిందన్న మంత్రి
- సమస్యలు అందరికీ ఉంటాయని వ్యాఖ్య
- పార్టీలో ఉంటే ఉండండి పోతే పొండి అంటూ గుస్సా
మంత్రి బొత్స సత్యనారాయణ తన పార్టీ కార్యకర్తలపై ఇంతెత్తున లేచారు. యూజ్ లెస్.ఫెలో.. పార్టీలో ఉంటే ఉండండి. పోతే పొండి..అంటూ గయ్యిమన్నారు. దీంతో..ఆయన వద్దకు వచ్చిన కార్యకర్తలు చిన్నబుచ్చుకున్నారు. విజయనగరంలో ఇటీవల జరిగిందీ ఘటన.
స్థానిక పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి అక్కడి కార్యకర్తలతో మాట్లాడారు. ఆ తరువాత తన కారులో బయలుదేరుతుండగా.. ఎస్‌కోట టౌన్ అధ్యక్షుడు ఆయనను కలిశారు. స్థానికంగా నెలకొన్న పరిస్థితులను వివరించే ప్రయత్నం చేశారు. దీంతో మంత్రి బొత్స అసహనానికి గురయ్యారు. కార్యకర్తల్లో క్రమశిక్షణా రాహిత్యం పెరిగిందని మండిపడ్డారు. ‘‘ఏందయ్యా మీ బాధ, మీకేనా బాధలు..మాకు లేవా? కార్యకర్తలు అంటే ఇలానే ఉంటారా? బాధలు అందరికీ ఉంటాయి. సమయం సందర్భం ఉండక్కర్లేదా? పార్టీలో ఉంటే ఉండండి పోతే పొండి’’ అంటూ తీవ్ర స్వరంతో ఫైరైపోయారు. ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది. సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన వారితో ఇలాగేనా మాట్లాడేది అంటూ కేడర్ నొచ్చుకున్నట్టు సమాచారం.