రానున్న ఐదు రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి: ఐఎండీ
- ఇప్పటికే దేశంలో చాలా భాగాల్లో మండుతున్న ఎండలు
- గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో 2 నుంచి 4 డిగ్రీల పెరుగుదల
- పలు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు
ఇప్పటికే దేశంలో చాలా భాగాల్లో ఎండలు మండిపోతున్నాయి. మరోపక్క, రానున్న ఐదు రోజుల్లో దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ మేర పెంపు చోటుచేసుకోవచ్చని వివరించింది.
మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో రానున్న రెండ్రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. ఆ తర్వాత క్రమేపీ వర్షాలు తగ్గుముఖం పడతాయని ఐఎండీ పేర్కొంది. కాగా, ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఈ నెల మొదట్లో ఐఎండీ వెల్లడించింది.