దోచుకో పంచుకో తినుకో అనే స్కీమ్ అమలు చేస్తున్నారు: పట్టాభి
- జగన్ అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్నారన్న పట్టాభి
- ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేసేందుకు ప్రజాధనం మింగుతున్నారని విమర్శలు
- అవినీతి సొమ్ముతో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని వ్యాఖ్య
టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. సీఎం జగన్ అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్నారని వ్యాఖ్యానించారు. బినామీ కంపెనీల పేరుతో వేల కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు.
ఎన్నికలప్పుడు ఓట్లు కొనుగోలు చేసేందుకు ఇప్పటినుంచే ప్రజాధనం మింగుతున్నారని, అవినీతి సొమ్ముతో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని పట్టాభి మండిపడ్డారు. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని... దోచుకో పంచుకో తినుకో అనే స్కీమ్ ను అమలు చేస్తున్నారని విమర్శించారు.
"రాష్ట్రంలోని మూడు డిస్కంల పరిధిలో రూ.13 వేల కోట్ల అవినీతికి తెరలేపారు. షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్, రాఘవ కన్ స్ట్రక్షన్స్ కు దోచిపెడుతున్నారు. ఒక్కో మీటరు ఏర్పాటుకు రూ.35 వేలు చెల్లిస్తున్నారు. టెండర్ల పేరుతో వేల కోట్ల రూపాయలు దోచుకోవాలని చూస్తున్నారు. అందుకే, మూడు డిస్కంల పరిధిలో టెండర్ల వివరాలు ప్రజల ముందుంచాలి" అని డిమాండ్ చేశారు.