ఫారెస్టు నేపథ్యంలో ఆసక్తిని రేకెత్తిస్తున్న 'విడుదల' ట్రైలర్!

ఫారెస్టు నేపథ్యంలో ఆసక్తిని రేకెత్తిస్తున్న 'విడుదల' ట్రైలర్!
  • తమిళంలో సక్సెస్ ను సాధించిన 'విడుదలై'
  • తెలుగులో 'విడుదల' టైటిల్ తో ఈ నెల 15న రిలీజ్ 
  • ప్రధానమైన పాత్రను పోషించిన సూరి 
  • కీలకమైన పాత్రలో కనిపించనున్న విజయ్ సేతుపతి 
  • వెట్రిమారన్ కి ప్రశంసలు తెచ్చిపెట్టిన సినిమా
తమిళనాట ఇంతవరకూ కమెడియన్ గా ప్రేక్షకులను అలరిస్తూ వచ్చినవారిలో సూరి ఒకరు. తనదైన మేనరిజంతో .. డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను సూరి ఆకట్టుకున్నాడు. అలాంటి సూరి ప్రధానమైన పాత్రను పోషించిన తమిళ సినిమానే 'విడుదలై'. క్రితం నెల 31వ తేదీన తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, సక్సెస్ టాక్ తెచ్చుకుంది. వెట్రి మారన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఇప్పుడు 'విడుదల' పేరుతో తెలుగులోకి అనువదించారు.

విజయ్ సేతుపతి పవర్ ఫుల్ రోల్ పోషించిన ఈ సినిమాను ఇక్కడ ఈ నెల 15వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు వెర్షన్ కి సంబంధించిన ట్రైలర్ ను కొంతసేపటికి క్రితం వదిలారు. అడవి బిడ్డలైన గిరిజనులకు .. పోలీస్ వారికి మధ్య నడిచే పోరాటంగా ఈ కథ కనిపిస్తోంది. 

ఫారెస్టు నేపథ్యంలో 'ప్రజాదళం' నాయకుడు పెరుమాళ్ పాత్రలో విజయ్ సేతుపతి కనిపిస్తుంటే, ఓ సాధారణ పోలీస్ పాత్రను సూరి పోషించాడు. పెరుమాళ్ ను పట్టుకోవడానికి పోలీస్ లు రంగంలోకి దిగుతారు. ఆ ప్రయత్నంలో భాగంగా గిరిజనులను హింసిస్తుంటారు. అప్పుడు పెరుమాళ్ ఏం చేస్తాడు? సూరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? అనేదే కథ. తెలుగులో ఈ సినిమా ఎలాంటి రిజల్టును రాబడుతుందనేది చూడాలి మరి.


More Telugu News