దేవుడా.. పల్సర్ ను నీటిలో కూడా నడుపుతారా!
- నదిలో ఓ యువకుడి సాహసం
- పల్సర్ పై ఒక ఒడ్డు నుంచి మరో ఒడ్డుకి డ్రైవ్ చేస్తూ వెళ్లిన యువకుడు
- సంకల్పం ఉన్న చోట మార్గం ఉంటుందన్న అభిప్రాయం
రోడ్డుపై, నీళ్లలోనూ నడిచే బహుళ ప్రయోజనకర వాహనం మార్కెట్లోకి వస్తే హాట్ కేకుల్లా అమ్ముడు పోతుందంటే ఆశ్చర్యం పడక్కర్లేదు. కానీ, ఓ యువకుడు అలాంటి వాహనం వచ్చే వరకు వేచి చూడలేదు. పల్సర్ బైక్ పై నదిలో డ్రైవ్ చేసుకుంటూ వెళ్లి అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. నదిలో నీరు తక్కువ ఉండడం అనుకూలం. పల్సర్ బైక్ మునిగేంత నీరు లేదు. ఒకటి రెండు అడుగుల మేర ఉండడంతో అతడు చక్కగా డ్రైవ్ చేసుకుంటూ ఒక ఒడ్డు నుంచి అవతలి ఒడ్డుకు చేరుకున్నాడు.
నీరు తక్కువగా ఉన్నా, కింద ఇసుక ఉంటుంది. కనుక వాహనం నడపడం, నియంత్రించడంపై మంచి పట్టు ఉంటేనే ఇలాంటివి సాధ్యపడతాయి. ఈ యువకుడు పల్సర్ బైక్ తో చేసిన ఈ ఫీట్ నెటిజన్లను ఎంతగానో ఆకర్షిస్తోంది. మోటార్ ఆక్టేన్ అనే ఆటోమొబైల్ బ్లాగ్, యూట్యూబ్ చానల్ ఈ వీడియోని తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేసింది.
సంకల్పం ఉంటే మార్గం ఉంటుందని కొటేషన్ పెట్టింది. ‘దీని గురించి ఆలోచించండి. ఇది తెలివైనదా లేక ప్రమాదకరమైనదా?’ అంటూ ప్రశ్న సంధించింది. ఈ వీడియోకి ఐదు లక్షల వ్యూస్ వచ్చాయి. ఓ యూజర్ స్పందిస్తూ ఇది నిజంగా రిస్కీనే. నీరు ఎగ్జాస్ట్ లోకి వెళితే ఇంజన్ పరిస్థితి ఏమి కాను? అని ప్రశ్నించాడు. రిస్క్ ను అంచనా వేసుకుని తెలివిగా డ్రైవ్ చేశాడంటూ మరో యూజర్ మెచ్చుకున్నారు.