చంద్రబాబు వచ్చారంటేనే నెల్లూరు జిల్లా ప్రజలు భయపడుతున్నారు: కాకాణి
- నిన్న టిడ్కో ఇళ్ల వద్ద సెల్ఫీ దిగిన చంద్రబాబు
- చంద్రబాబు అభివృద్ధి చేయలేదన్న కాకాణి
- దమ్ముంటే 175 స్థానాల్లో పోటీ చేయాలని సవాల్
నెల్లూరులో టిడ్కో ఇళ్ల వద్ద నిన్న చంద్రబాబు సెల్ఫీ దిగిన సంగతి తెలిసిందే. 'చూడు....జగన్! ఇవే మా ప్రభుత్వ హయాంలో పేదలకు నాడు నెల్లూరులో కట్టిన వేలాది టిడ్కో ఇళ్లు' అంటూ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో నాడు కట్టిన లక్షల ఇళ్లకు ఇవే సజీవ సాక్ష్యాలు అంటూ స్పష్టం చేశారు. ఈ నాలుగేళ్లలో నువ్వు కట్టిన ఇళ్లెన్ని? అసలు, నువ్వు కట్టిన ఇళ్లెక్కడ... జవాబు చెప్పగలవా? అంటూ జగన్ ను ట్యాగ్ చేస్తూ సెల్ఫీ ఫోటోను చంద్రబాబు పంచుకున్నారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబుపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు వచ్చారంటేనే నెల్లూరు జిల్లా ప్రజలు భయపడుతారని చెప్పారు. చంద్రబాబు ఏమాత్రం అభివృద్ధి చేయలేదు కాబట్టే... టిడ్కో ఇళ్ల వద్ద సెల్ఫీ దిగి షేర్ చేశారని అన్నారు. అయిదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఇళ్లు ఇవ్వలేకపోయినందుకు చంద్రబాబు సిగ్గుపడాలని చెప్పారు. దమ్ముంటే 175 స్థానాల్లో టీడీపీ పోటీ చేయాలని అన్నారు. నువ్వే మా నమ్మకం జగనన్న కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ మరోసారి ఘన విజయం సాధించడం ఖాయమని అన్నారు.