అదానీ, అంబానీ వంటి వారిని టార్గెట్ చేయాలనుకోవడం సరికాదు: శరద్ పవార్

  • పార్లమెంటును కుదిపేసిన అదానీ అంశం
  • అదానీపై జేపీసీ వేయాలంటూ కాంగ్రెస్, విపక్షాల డిమాండ్
  • కావాలనే అదానీని టార్గెట్ చేశారన్న పవార్
ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలంటూ పార్లమెంటును విపక్షాలు హోరెత్తించిన సంగతి తెలిసిందే. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇదే అంశంపై విపక్షాలు పట్టబట్టాయి. ఈ క్రమంలో ఇతర అంశాలపై పెద్దగా చర్చ జరగకుండానే పార్లమెంటు సమావేశాలు ముగిసిపోయాయి. 

దీనిపై మన దేశంలోని సీనియర్ రాజకీయ నేతల్లో ఒకరైన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆవేదన వ్యక్తం చేశారు. అదానీ గురించి రిపోర్ట్ ఇచ్చిన హిండెన్ బర్గ్ ఎక్కడిది, దాని చరిత్ర ఏమిటని ప్రశ్నించారు. కావాలనే అదానీని టార్గెట్ చేశారని విమర్శించారు. అదానీ, అంబానీ వంటి పెద్ద పారిశ్రామికవేత్తలను టార్గెట్ చేయాలని రాహుల్ గాంధీ అనుకోవడం సరికాదని చెప్పారు. అదానీపై జేపీసీ వేయాలంటూ కాంగ్రెస్ డిమాండ్ చేయడం వల్ల వచ్చే ఉపయోగం ఏమిటని ప్రశ్నించారు. అంబానీ పెట్రో కెమికల్ రంగంలో ఉన్నారని, అదానీ విద్యుత్ రంగంలో సేవలందిస్తున్నారని... ఇవన్నీ దేశానికి అవసరం లేదా? అని ఆయన ప్రశ్నించారు.


More Telugu News