చంద్రబాబు ఇంటిపై జగన్ స్టిక్కర్ అంటిస్తామా?: అంబటి రాంబాబు

  • ఇంటింటికీ జగన్ స్టిక్కర్ అతికించాలని నిర్ణయం
  • ఈ నెల 11 నుంచి కార్యక్రమం ప్రారంభం
  • ఇంటింటికీ వెళ్లి జగన్ బొమ్మ అతికించడానికి తమకేం పని అన్న అంబటి
  • రాష్ట్రంలోని 50 శాతానికి పైగా ప్రజలు స్టిక్కర్ అతికించేందుకు అనుమతిస్తారని ఆశాభావం
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇటీవల ఓ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 11 నుంచి ఇంటింటికి వెళ్లి జగన్ స్టిక్కర్ అంటించాలని నిర్ణయించింది. ‘మా నమ్మకం నువ్వే’ అని ముద్రించిన ఈ స్టిక్కర్లను ఇంటి యజమాని అనుమతితో అతికించాలని నిర్ణయించారు. ప్రభుత్వ నిర్ణయంపై టీడీపీ, జనసేన పార్టీలు విమర్శలు గుప్పించాయి. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి అంబటి రాంబాబు స్పందించారు.

వైసీపీ వాళ్లొచ్చి ప్రతి ఇంటికి స్టిక్కర్ అతికించి వెళ్తారని చంద్రబాబు, పవన్ అంటున్నారని, అలా ఇంటింటికీ వెళ్లి జగన్ బొమ్మ అంటించేందుకు తమకేం పని అని, చంద్రబాబు ఇంటిపైనా జగన్ స్టిక్కర్ అతికిస్తామా? అని ప్రశ్నించారు. 

సత్తెనపల్లిలో నిన్న విలేకరులతో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని 50 శాతానికి పైగా ప్రజలు జగన్ స్టిక్కర్‌ను అతికించేందుకు అనుమతిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తారు. ప్రజల అనుమతితోనే ఇంటి గోడలు, ఫోన్లపై టికెట్లు అతికిస్తామని మంత్రి రాంబాబు స్పష్టం చేశారు.


More Telugu News