'ది ప్రింట్' లో వచ్చిన కథనంపై జగన్ ఏం చెపుతారు?: బొండా ఉమ
- జగన్ దేశంలోనే అత్యంత ధనవంతుడు ఎలా అయ్యాడన్న బొండా ఉమ
- ది ప్రింట్ వెబ్ సైట్లో జగన్ ఆస్తులపై కథనం వచ్చిందని వ్యాఖ్య
- సాక్షి ఎవరిదో జగన్ చెప్పాలని డిమాండ్
తప్పుడు హామీలు, అబద్ధాలతో మరోసారి జనాలను మోసం చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ రెడీ అయ్యారని టీడీపీ నేత బొండా ఉమ అన్నారు. తనకు ఆర్థిక బలం లేదని చెప్పుకుంటున్న జగన్ దేశంలోనే అత్యంత ధనవంతుడు ఎలా అయ్యారని ప్రశ్నించారు. తండ్రి వైఎస్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించిన లక్షల కోట్లు ఎక్కడ దాచారో చెప్పాలని డిమాండ్ చేశారు. రూ. 43 వేల కోట్ల అక్రమాస్తుల కేసులో 16 నెలలు జైల్లో ఎందుకున్నారని ప్రశ్నించారు. అవినీతి కేసుల విచారణకు కూడా జగన్ వెళ్లడం లేదని విమర్శించారు.
'ది ప్రింట్' వెబ్ సైట్ లో జగన్ ఆస్తులపై కథనం వచ్చిందని, దానిపై ఆయన ఏం చెపుతారని బొండా ఉమ ప్రశ్నించారు. తనకు మీడియా సంస్థలు లేవని చెపుతున్న జగన్ సాక్షి ఎవరిదో చెప్పాలని అడిగారు. కన్న తల్లిని, చెల్లిని పట్టించుకోని జగన్ రాష్ట్రంలోని ఆడబిడ్డలను ఎలా రక్షిస్తాడని ప్రశ్నించారు. బాబాయ్ వివేకాను చంపిన వారితో తాడేపల్లిలో విందులు, వినోదాల్లో పాల్గొంటున్నారని ఆరోపించారు.