బండి సంజయ్‌కు బీజేపీ పెద్దల ఫోన్.. గో అహెడ్ అంటూ గ్రీన్ సిగ్నల్

  • బెయిల్‌పై విడుదలైన సంజయ్‌ను బీజేపీ పెద్దలు ఫోన్లో పరామర్శ
  • హైకమాండ్ అండగా ఉంటుందని భరోసా
  • ప్రజా సమస్యలపై పోరాటం మరింత ఉద్ధృతం చేయాలని దిశానిర్దేశం
పదో తరగతి ప్రశ్న పత్రం కేసులో బెయిల్‌పై విడుదలైన తెలంగాణ బీజేపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు బీజేపీ పెద్దలు ఫోన్ చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఫోన్లో మాట్లాడారు. తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, పలువురు ఇతర జాతీయ నేతలు పరామర్శించారు. ఈ సందర్భంగా బీజేపీ పెద్దలు ‘‘గో అహెడ్.. హైకమాండ్ మీకు అండగా ఉంటుంది’’ అంటూ పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం మరింత ఉద్ధృతం చేయాలని దిశా నిర్దేశం చేశారు. బీఆర్‌ఎస్ కుట్రలు ఛేదించాలని సంజయ్‌కు అగ్రనేతలు చెప్పినట్టు సమాచారం. 

కాగా నేడు ఉదయం కరీంనగర్ జైలు నుంచి సంజయ్‌ బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. రూ.20 వేల పూచీకత్తుతో పాటూ ఇద్దరి జమానతు సమర్పించాలని హనుమకొండ నాలుగో అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ ఇన్‌చార్జ్ న్యాయమూర్తి రాపోలు అనిత తీర్పు వెలువరించారు. దేశం విడిచి వెళ్లరాదని, సాక్షులను ప్రభావితం చేయకూడదని, కేసు విచారణకు సహకరించాలని షరతులు విధించారు. ఇక జైలు నుంచి బయటకు వచ్చిన సంజయ్‌ అధికార బీఆర్‌ఎస్‌పై పలు విమర్శలు గుప్పించారు.


More Telugu News