నేడు బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి
- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి
- కొన్ని రోజుల క్రితమే కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన కిరణ్
- ఢిల్లీలో బీజేపీ పెద్దల సమక్షంలో చేరనున్న మాజీ సీఎం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా ఉన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నేడు కాషాయ కండువా కప్పుకోనున్నారని సమాచారం. ఢిల్లీలో పార్టీ కీలక నేతల సమక్షంలో ఆయన పార్టీలో చేరనున్నారు. కొన్ని రోజుల క్రితమే కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో తన బాధ్యతలపై అధిష్ఠానం హామీల తరువాత పార్టీలో చేరేందుకు ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది.
కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఏపీలో 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. వైఎస్సార్ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వ చీఫ్ విప్‌గా, అసెంబ్లీ స్పీకర్‌గానూ సేవలందించారు. 2010-14 మధ్య సీఎంగా చేసిన ఆయన విభజన బిల్లును వ్యతిరేకిస్తూ తన పదవికి రాజీనామా చేశారు. ఆపై కొన్నాళ్ల పాటు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు.
తదనంతర పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఆయన జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టి ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. ఆ తరువాత పార్టీని రద్దు చేసిన ఆయన 2018లో మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు.