భారీ రేటుకు నిఖిల్ సిద్ధార్థ్ 'స్పై' డిజిటల్ రైట్స్!
- 'కార్తికేయ 2'తో నార్త్ లో పెరిగిన నిఖిల్ క్రేజ్
- ఆ తరువాత చేసిన పాన్ ఇండియా సినిమాగా 'స్పై'
- కథానాయికగా అలరించనున్న ఐశ్వర్య మీనన్
- జూన్ లో ఈ సినిమా ఐదు భాషల్లో విడుదల
మొదటి నుంచి కూడా నితిన్ వైవిధ్యభరితమైన కథలను .. పాత్రలను చేస్తూ వెళుతున్నాడు. ఆ మధ్య ఆయన నుంచి వచ్చిన 'కార్తికేయ 2' సంచలన విజయాన్ని సాధించింది. పాన్ ఇండియా స్థాయిలో నిఖిల్ కి క్రేజ్ ను తెచ్చిపెట్టింది. దాంతో ఇప్పుడు ఆయన తాజా చిత్రమైన 'స్పై' పాన్ ఇండియా స్థాయిలోనే నిర్మితమవుతోంది.
గ్యారీ బీహెచ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను ఎంత భారీ స్థాయిలో నిర్మించారనేది టీజర్ చెప్పేసింది. ఈ సినిమా థియేట్రికల్ హక్కులు 35 కోట్లకి అమ్ముడైనట్టు తెలుస్తోంది. ఇక నాన్ థియేట్రికల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ - స్టార్ నెట్ వర్క్ వారు దక్కించుకున్నారు.
ఐదు భాషలకి సంబంధించిన నాన్ థియేట్రికల్ హక్కులు 40 కోట్లకి అమ్ముడైనట్టుగా ఈ సినిమా యూనిట్ చెప్పింది. ఇంతవరకూ నిఖిల్ చేసిన సినిమాల్లో ఈ స్థాయి మార్కెటింగ్ జరిగిన సినిమా ఇదేనని అంటున్నారు. 'కార్తికేయ 2'తో నార్త్ లో పెరిగిపోయిన నిఖిల్ క్రేజ్ అందుకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.