వరుసగా ఐదో రోజు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • 143 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 42 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 3 శాతం వరకు పెరిగిన బజాజ్ ఫైనాన్స్ షేరు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజు లాభాల్లో ముగిశాయి. ఉదయం నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభించిన మార్కెట్లు ఆ తర్వాత ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన ప్రకటన తర్వాత లాభాల్లోకి వెళ్లాయి. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 143 పాయింట్లు లాభపడి 59,833కి పెరిగింది. నిఫ్టీ 42 పాయింట్లు పెరిగి 17,599 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫైనాన్స్ (2.95%), టాటా మోటార్స్ (2.61%), బజాజ్ ఫిన్ సెర్వ్ (1.90%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.80%), సన్ ఫార్మా (1.50%). 

టాప్ లూజర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.73%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.10%), యాక్సిస్ బ్యాంక్ (-1.04%), టెక్ మహీంద్రా (-0.98%), టైటాన్ (-0.93%).


More Telugu News