బండి సంజయ్ రిమాండ్ పై విచారణను ఈ నెల 10కి వాయిదా వేసిన హైకోర్టు
- పేపర్ లీక్ కేసులో బండి సంజయ్ కు 14 రోజుల రిమాండ్
- రిమాండ్ రద్దు చేయాలని హైకోర్టులో సంజయ్ పిటిషన్
- కౌంటర్ దాఖలు చేయాాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు
పదో తరగతి పేపర్ లీకేజ్ వ్యవహారంలో బండి సంజయ్ కు హనుమకొండ జిల్లా ప్రధాన మున్సిఫ్ మేజిస్ట్రేట్ రాపోలు అనిత 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. మరోవైపు సంజయ్ రిమాండ్ ను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో బీజేపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై విచారణను చేపట్టిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది.
తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. అయితే బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చంటూ సంజయ్ కు సూచించింది. దీంతో, సంజయ్ కి బెయిల్ ఇవ్వడానికి మేజిస్ట్రేట్ కోర్టు నిరాకరించినా హైకోర్టులో ఆయన వెంటనే అప్పీల్ చేసుకోవచ్చు. హైకోర్టుకు మూడు రోజులు సెలవులు ఉన్నప్పటికీ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని హైకోర్టు తెలిపింది.