15 అంతస్తుల బిల్డింగు టెర్రస్ పైన పిల్లల ప్రమాదకర క్రీడ
- గట్టిగా 12 ఏళ్లు కూడా లేని చిన్నారులు
- ఎత్తయిన ఆకాశ హర్మ్యాల చివరన జంపింగ్
- ఒక భవనం నుంచి మరో భవనం పిట్టగోడలపైకి దూకుడు
అవి ఎత్తయిన ఆకాశ హర్మ్యాలు. 15 అంతస్తులకుపైనే ఉంటాయి. అలాంటి ఎత్తయిన టవర్ల చివరి అంతస్తుపైకి ఓ ఇద్దరు చిన్నారులు చేరారు. అది కూడా పిట్టగోడలపైకి. ఒకడి వయసు 8 ఏళ్లు, మరొకడి వయసు 10-11 ఏళ్లు ఉంటుంది. అందులో 8 ఏళ్ల చిన్నారి ఒక టవర్ పిట్ట గోడపై నిలుచున్నాడు. మరో చిన్నారి ఒక టవర్ పై నుంచి మరో టవర్ పిట్టగోడ పైకి గెంతుతూ ఉన్నాడు.
ఇద్దరు చిన్నారులకు ఎలాంటి రక్షణలూ లేవు. పెద్దవారు కూడా అక్కడ లేరు. తమను పట్టించుకునే వారు లేకపోవడం, అదే సమయంలో వారికి కింద పడిపోతామనే విషయం తెలియకపోవడంతో స్వేచ్ఛగా అక్కడ ఆడలాడుకోవడాన్ని చూస్తే.. వళ్లు గగుర్పొడుస్తుంది. ఇంటర్నెట్ లోకి చేరిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
అథ్లెటిక్ శిక్షణలో భాగంగా శిక్షకులు ఇలాంటివి చేయిస్తుంటారు. దీన్ని పార్కర్ గా చెబుతుంటారు. అంటే ఒక పాయింట్ నుంచి మరో పాయింట్ కు దూకడం. కానీ, భూమికి 200 అడుగుల ఎత్తులో ఎలాంటి రక్షణలు లేని చోట చిన్నారులు ఇలాంటి విన్యాసాలు చేస్తుండడం, పెద్దల నిర్లక్ష్యానికి నిదర్శనమనే అభిప్రాయం వినిపిస్తోంది. దూరంగా ఉన్న మేడ మీద నుంచి ఎవరో ఈ బాలురుని వీడియో తీసి ఇంటర్నెట్ లో పెట్టడంతో అందరి దృష్టిలోకి వచ్చింది. చిన్నారులు అక్కడి నుంచి జారి పడితే ప్రాణాలతో బయటపడటం కష్టం.