రాజశేఖర్ మొదట్లో వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నారు: జీవిత
- వెన్నెల కిశోర్ టాక్ షో 'అలా మొదలైంది'
- టాక్ షోకు అతిథులుగా విచ్చేసిన జీవిత, రాజశేఖర్
- నెటిజెన్లను ఆకట్టుకుంటున్న టాక్ షో ప్రోమో
టాలీవుడ్ సీనీ జంటల్లో జీవిత, రాజశేఖర్ ల జంట ఒకటి. వీరి వివాహం జరిగి ఎన్నో ఏళ్లు పూర్తవుతున్నా... ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. వీరి ఇద్దరు అమ్మాయిలు కూడా సినీ హీరోయిన్లుగా మారారు. మరోవైపు తన భర్తకు సంబంధించి జీవిత ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తమ ప్రేమ, పెళ్లి గురించి చెప్పిన ఆమె... రాజశేఖర్ మొదట్లో మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నారని తెలిపారు. ఆ విషయం తెలిసి తాను ఎంతో బాధపడ్డానని, కన్నీళ్లు కూడా పెట్టుకున్నానని అన్నారు. ఈ సందర్భంగా కల్పించుకున్న రాజశేఖర్ చెబుతూ.. తాను ఆసుపత్రిలో ఉన్నప్పుడు తనకు సేవలు చేసి, తన తల్లిదండ్రులను మెప్పించి జీవిత తనను పెళ్లి చేసుకుందని నవ్వుతూ అన్నారు.
ఈటీవీలో ప్రముఖ సినీ నటుడు వెన్నెల కిశోర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో 'అలా మొదలైంది' ప్రారంభమయింది. ఈ కార్యక్రమానికి జీవిత, రాజశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరిద్దరూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. వీరి షోకు సంబంధించిన ప్రోమో నెటిజెన్లను ఆకట్టుకుంటోంది.