నా రెండో సినిమా కూడా దిల్ రాజుతోనే: బలగం వేణు

నా రెండో సినిమా కూడా దిల్ రాజుతోనే: బలగం వేణు
  • మున్నా సినిమాతో హాస్య నటుడిగా టాలీవుడ్ కు పరిచయమైన వేణు
  • బలగం చిత్రంతో దర్శకుడిగా ఘన విజయం సొంతం
  • తెలంగాణ సంస్కృతిని అద్భుతంగా చూపెట్టిన వేణు
ప్రభాస్ హీరోగా దిల్ రాజు నిర్మించిన మున్నా సినిమాతో హాస్య నటుడిగా టాలీవుడ్ లో అడుగు పెట్టిన వ్యక్తి వేణు. ఆ సినిమాలో పోషించిన టిల్లు పాత్రతో..  వేణు టిల్లుగా పేరు తెచ్చుకున్నాడు. అనూహ్యంగా దర్శకుడిగా మారిన వేణు రూపొందించిన తొలి చిత్రం ‘బలగం’. దిల్ రాజు బ్యానర్ లో వచ్చిన ఈ చిత్రం సంచలన విజయాన్ని అందుకుంది. తెలంగాణ సంస్కృతి, పల్లె వాతావరణం, మానవ సంబంధాల గురించి అద్భుతంగా తెరకెక్కించిన వేణు అందరినీ ఆశ్చర్యపరిచాడు. 

ఈ భారీ హిట్ తర్వాత వేణు తదుపరి సినిమాపై గురించి అప్పుడే చర్చ మొదలైంది. దీనిపై స్పందించిన వేణు తన రెండో సినిమా కచ్చితంగా దిల్ రాజు బ్యానర్ లోనే ఉంటుందని స్పష్టం చేశాడు.  ఇప్పటికే రాజుకు ఓ కథ కూడా చెప్పానని తెలిపాడు. దానికి దిల్ రాజు కొన్ని సూచనలు చేశారన్నాడు. అవి తనకు కొత్త కిక్ ఇచ్చాయని తెలిపాడు. రాజు సూచనలకు అనుగుణంగా కథను తీర్చిదిద్దుతానని చెప్పాడు.  ప్రస్తుతం బలగం సక్సెస్ ను పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నానని చెప్పిన వేణు నటుడిగానూ కొనసాగుతానని స్పష్టం చేశాడు.


More Telugu News