భారత్‌లో 5 వేల మార్కు దాటిన రోజువారీ కరోనా కేసులు!

  • గత 24 గంటల్లో కొత్తగా 5335 కరోనా కేసుల నమోదు
  • గతేడాది సెప్టెంబర్ తరువాత తొలిసారిగా 5 వేల మార్కు దాటిన సంఖ్య
  • మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 25,587
  • పాజిటివిటీ రేటు 3.32 శాతం, రికవరీ రేటు 98.75 శాతం
దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 5,335 కేసులు వెలుగులోకి వచ్చాయి. అంతకుముందు రోజుకంటే ఇది ఇరవై శాతం అధికం. గత ఏడాది సెప్టెంబర్ తరువాత భారత్‌లో రోజువారీ కేసుల సంఖ్య 5 వేల మార్కు దాటడం ఇదే తొలిసారి. కరోనా వ్యాప్తి తీవ్రతను సూచించే రోజువారీ పాజిటివిటీ రేటు 3.32గా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా పేర్కొంది. 

దేశంలోని మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 25,587గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల వాటా 0.06 శాతం కాగా రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది. ఇక గత 24 గంటల్లో 2826 మంది కరోనా నుంచి బయటపడ్డట్టు కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో మొత్తం రికవరీల సంఖ్య 4,41,82,538.


More Telugu News