ఆ రోజున మెగాస్టార్ చెప్పింది ఈ రోజున నిజమైంది: దిల్ రాజు

  • 20 ఏళ్ల కెరియర్ ను పూర్తిచేసుకున్న దిల్ రాజు 
  • తాజా ఇంటర్వ్యూలో గతాన్ని గురించిన ప్రస్తావన 
  • మొదటి ఆరు సినిమాలు వరుస హిట్లు ఇచ్చాయని వ్యాఖ్య 
  • వాటికి నలుగురు కొత్త దర్శకులను పరిచయం చేశానని వెల్లడి
'దిల్' సినిమా టైటిల్ ను ఇంటిపేరుగా చేసుకున్న 'దిల్' రాజు, ఈ రోజున టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒకరు. తాజాగా 'దిల్' సినిమా 20 ఏళ్లను పూర్తిచేసుకుంది. అంటే నిర్మతగా దిల్ రాజు 20 ఏళ్ల కెరియర్ ను పూర్తిచేసుకున్నాడు. ఈ సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, అంతకుముందు నన్ను నైజామ్ రాజు అనేవారు .. 'దిల్' సినిమా తరువాత దిల్ రాజు అని పిలవడం మొదలైంది" అని అన్నారు. 

"నా కెరియర్లో 'పరుగు' ఆరో సినిమా. ఈ ఆరు సినిమాల్లో నలుగురు కొత్త దర్శకులను పరిచయం చేశాను. అన్ని సినిమాలూ హిట్ కావడంతో, అంతా నా గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. 'పరుగు' ఫంక్షన్ లో చిరంజీవి గారు మాట్లాడుతూ, చక్రపాణి .. నాగిరెడ్డి .. రామానాయుడు వంటి వారితో పోల్చారు. 'అంతటి వారితో నన్ను పోల్చుతారేంటి? నేను ఇంకా ఆరో సినిమా దగ్గరే కదా ఉన్నాను' అని అనుకున్నాను. 

"అలాంటి నేను ఇంతవరకూ 50 సినిమాలను నిర్మించాను .. వీటిలో ఎక్కువ శాతం హిట్ కొట్టినవే. నేను వెళుతున్న రూట్ .. నా ఆలోచనా విధానం .. నా గ్రాఫ్ చూసే చిరంజీవి గారు ఆ రోజున ఆ మాట అనుంటారు అనే విషయం ఇప్పుడు అర్థమవుతోంది. కెరియర్ ఆరంభంలోనే వీవీ వినాయక్ .. సుకుమార్ .. బోయపాటి వంటి దర్శకులతో ఎక్కువగా చర్చలు జరుపుతూ వెళ్లడం వలన, స్క్రిప్ట్ సంబంధమైన అవగాహన ఏర్పడింది" అంటూ చెప్పుకొచ్చారు. 


More Telugu News