బాయ్ ఫ్రెండ్ ను పెళ్లాడేందుకు కెనడా నుంచి తిరిగొచ్చిన హర్యానా యువతి గల్లంతు
- తల్లిదండ్రుల ఫిర్యాదుతో దర్యాఫ్తు చేసిన పోలీసులు
- 3 నెలల తర్వాత పొలంలో యువతి అస్థికల గుర్తింపు
- తుపాకీతో కాల్చిచంపానని పోలీసులకు వెల్లడించిన యువతి బాయ్ ఫ్రెండ్
ఉన్నత చదువులు పూర్తిచేసిన ఓ యువతి మంచి భవిష్యత్తు కోసం కెనడా వెళ్లింది.. ఉద్యోగం చేసుకుంటూ అక్కడే సెటిల్ కావాలని నిర్ణయించుకుంది. అయితే, పెళ్లి చేసుకుందామని బాయ్ ఫ్రెండ్ పిలవడంతో ఇండియాకు తిరిగొచ్చింది. ఆ తర్వాత ఆచూకీ లేకుండా పోయింది. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదుతో దర్యాఫ్తు చేసిన పోలీసులు రెండు నెలల తర్వాత ఆమె అస్థికలను గుర్తించారు. బాయ్ ఫ్రెండే ఆమెను చంపేశాడని తేల్చారు. హర్యానాలో జనవరిలో జరిగిన ఈ హత్యోదంతం తాజాగా బయటపడింది.
హర్యానాకు చెందిన నీలమ్ (23) గతేడాది జూన్ లో కెనడా వెళ్లింది. ఉద్యోగం చేస్తూ అక్కడే సెటిల్ కావాలనే ఉద్దేశంతోనే వెళ్లిందని నీలమ్ సోదరి రోషిణి తెలిపింది. అయితే, పెళ్లి చేసుకుందామని బాయ్ ఫ్రెండ్ ఒత్తిడి తేవడంతో జనవరిలో నీలమ్ ఇండియాకు తిరిగొచ్చింది. ఈ ఏడాది జనవరిలో తిరిగొచ్చిన నీలమ్.. తర్వాత కనిపించకుండా పోయింది. తన నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో నీలమ్ తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. మరోవైపు నీలమ్ బాయ్ ఫ్రెండ్ సునీల్ కూడా కనిపించకుండా పోయాడు. దీంతో నీలమ్ పేరెంట్స్ పోలీసులను ఆశ్రయించారు.
నీలమ్ ఆచూకీ కోసం వెతుకుతున్న పోలీసులకు ఆమె బాయ్ ఫ్రెండ్ సునీల్ దొరికాడు. అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. నీలమ్ ను తుపాకీతో కాల్చి చంపేసినట్లు వెల్లడించాడు. హత్య విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు నీలమ్ మృతదేహాన్ని తన పొలంలో పాతిపెట్టానని చెప్పాడు. సునీల్ చెప్పిన ప్రదేశంలో తవ్వించగా నీలమ్ అస్థికలు బయటపడ్డాయని పోలీసులు తెలిపారు. వాటిని డీఎన్ఏ పరీక్ష కోసం ల్యాబ్ కు పంపినట్లు వివరించారు. అయితే, నీలమ్ ను ఎందుకు చంపేశాడనేది నిందితుడు వెల్లడించలేదని, దర్యాఫ్తు కొనసాగుతోందని పోలీసులు పేర్కొన్నారు. సునీల్ కు నేరచరిత్ర ఉందని, ఆరు కేసుల్లో నిందితుడని తెలిపారు.